Indian Stock Market: లాభాలతో 2025కి వీడ్కోలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:36 AM
ఈక్విటీ మార్కెట్ సూచీలు గత ఐదు రోజుల నష్టాలకు తెర దించి లాభాలతో 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికాయి. గత కొద్ది రోజుల మార్కెట్ నష్టాల కారణంగా...
ముంబై: ఈక్విటీ మార్కెట్ సూచీలు గత ఐదు రోజుల నష్టాలకు తెర దించి లాభాలతో 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికాయి. గత కొద్ది రోజుల మార్కెట్ నష్టాల కారణంగా సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చిన మంచి కంపెనీల షేర్ల కొనుగోలు జోరుగా సాగడం కలిసివచ్చింది. సానుకూల వాతావరణంలో బుధవారం ఇంట్రాడేలో 762.09 పాయింట్లు లాభపడి 85,437.17ని తాకిన సెన్సెక్స్ చివరికి 545.52 పాయింట్ల లాభంతో 85,220.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 190.75 పాయింట్లు లాభపడి 26,129.60 వద్ద ముగిసింది. మొత్తం మీద 2025 సంవత్సరంలో సెన్సెక్స్ 7,081.59 పాయింట్లు, నిఫ్టీ 2,484 పాయింట్లు లాభపడ్డాయి. బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.33.84 లక్షల కోట్లు పెరిగి రూ.4,75,79,238.11 కోట్లకు చేరింది.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి