3 రోజులు రూ.21 లక్షల కోట్లు
ABN , Publish Date - Mar 05 , 2026 | 05:45 AM
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడం, దాని ప్రభావంతో చమురు ధర లు భగ్గుమంటున్న నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్ సూచీలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. బుధవారం ట్రేడింగ్ ఆరంభంలో...
మార్కెట్ కల్లోలంలో
నష్టపోయిన సంపద
సెన్సెక్స్ మరో 1,122 పాయింట్లు డౌన్
24,500 దిగువకు జారిన నిఫ్టీ
ముంబై: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడం, దాని ప్రభావంతో చమురు ధర లు భగ్గుమంటున్న నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్ సూచీలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. బుధవారం ట్రేడింగ్ ఆరంభంలో 1,795.65 పాయింట్లు క్షీణించి 78,443.20 వద్దకు పడిపోయిన సెన్సెక్స్.. మధ్యా హ్నం కాస్త కోలుకుంది. చివరికి 1,122.66 పాయింట్ల నష్టంతో 79,116.19 వద్ద స్థిరపడిం ది. ప్రారంభ ట్రేడింగ్‌లో 560.3 పాయింట్లు తగ్గి 24,305.40 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమో దు చేసిన నిఫ్టీ.. చివరికి 385.20 పాయింట్ల నష్టంతో 24,480.50 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.9.72 లక్షల కోట్లు తగ్గి రూ.447.18 లక్షల కోట్లకు (4.85 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 3,805 పాయింట్లు (4.6ు), నిఫ్టీ 1,191 పాయింట్లు (4.7ు) క్షీణించాయి. రూ.21.29 లక్షల కోట్ల మార్కెట్ సంపద హరించుకుపోయింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 27 నష్టపోగా.. టాటా స్టీల్ షేరు 6.76% తగ్గి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది.
బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.42ు, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 2.10% తగ్గాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.8,752.65 కోట్ల విక్రయాలు జరుపగా.. ఎల్‌ఐసీ సహా ఇతర దేశీయ సంస్థలు రూ.12,068.17 కోట్ల కొనుగోళ్లు జరిపాయి.
ఆసియా మార్కెట్లకు భారీ నష్టాలు
యుద్ధం కారణంగా ఆసియా మార్కెట్ల సూచీలన్నీ భారీగా నష్టపోయాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ ఏకంగా 12ు క్షీణించింది. కోస్పీ ఇండెక్స్ చరిత్రలో ఇదే అతిపెద్ద పతనం. కాగా, జపాన్ నిక్కీ 3.61ు, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.01ు, షాంఘై ఎస్‌ఎ్‌సఈ కాంపోజిట్ ఇండెక్స్ 0.98ు తగ్గాయి. మంగళవారం ట్రేడింగ్‌లో 3 శాతానికి పైగా నష్టపోయిన యూరప్ మార్కెట్లు మాత్రం బుధవారం లాభాల్లో ట్రేడయ్యాయి. అమెరికా సూచీలూ లాభాల్లో పయనించాయి.
ఆయిల్, ఎయిర్‌లైన్స్ షేర్లు నష్టాల్లోనే..
ఆయిల్ మార్కెటింగ్, పెయింట్ల తయారీ, ఎయిర్‌లైన్స్, పర్యాటక సేవల కంపెనీల షేర్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో కొనసాగాయి. హెచ్‌పీసీఎల్ 5.41ు, బీపీసీఎల్ 4.94ు, ఐఓసీ 4.78ు నష్టపోయాయి. షాలిమార్ పెయింట్స్ 2.60ు, బెర్జర్ పెయింట్స్ 2.22ు, ఇండిగో పెయింట్స్ 1.49ు, ఏషియన్ పెయిం ట్స్ 0.95ు, కాన్సాయ్ నెరొలాక్ పెయింట్స్ 0.89ు, అక్జో నోబెల్ షేరు 0.28ు తగ్గాయి. ఎయిర్‌లైన్స్ విషయానికొస్తే, ఇండిగో 2.85ు, స్పైస్‌జెట్ 7.52ు క్షీణించాయి.
పెట్రోనెట్ షేరు 9% డౌన్
ఎల్‌ఎన్‌జీ దిగుమతిదారు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ షేరు బీఎ్‌సఈలో 9.27ు నష్టపోయి రూ.280.50 వద్ద ముగిసింది. ఒకదశలో 11.69ు క్షీణించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్ తన ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి నిలిపివేయడంతో భారత్‌కు సరఫరా నిలిచిపోవడం ఇందుకు కారణం.
3 వారాల గరిష్ఠానికి బాండ్ల రేట్లు
ప్రభుత్వ బాండ్లపై వడ్డీరేట్లు దాదాపు 3 వారాల గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై రేటు గత నెల 20 తర్వాత 6.7112 శాతానికి పెరిగింది.

రూపీ క్రాష్
ఒక్కరోజులో 56 పైసలు క్షీణత
భారత కరెన్సీ విలువ సరికొత్త జీవనకాల కనిష్ఠానికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 56 పైసలు క్షీణించి రూ.92.05 వద్ద ముగిసింది. ఒకదశలో 86 పైసల నష్టంతో మారకం రేటు రూ.92.35 వద్దకు చేరింది. ఎక్స్ఛేంజ్ రేటు రూ.92 దాటడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు భగ్గుమనడం, డాల ర్ బలోపేతం ఇందుకు ప్రధాన కారణమని ఫారెక్స్ వర్గాలు తెలిపాయి. ఈక్విటీ మార్కెట్లో భారీ నష్టాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై మరింత ఒత్తిడి పెంచాయన్నారు. ఆరు అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 98.82కి చేరగా.. బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర ఒకదశలో 82.50 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..