Indian Rupee Depreciation: కంగారెన్సీ
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:23 AM
మన కరెన్సీకి కంగారెక్కువైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2025లో 5ు పతనమైంది. మారకం రేటు తొలిసారిగా రూ.90 మార్క్‌ను దాటింది. డిసెంబరు 16న డాలర్‌తో...
2025లో 5 శాతం క్షీణించిన రూపాయి
మన కరెన్సీకి కంగారెక్కువైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2025లో 5ు పతనమైంది. మారకం రేటు తొలిసారిగా రూ.90 మార్క్‌ను దాటింది. డిసెంబరు 16న డాలర్‌తో రూపాయి మారకం రేటు ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.91.08కి చేరింది. 2025లో ఆసియాలోకెల్లా అత్యధికంగా క్షీణించిన దేశీయ కరెన్సీగా మిగిలింది. గడిచిన మూడేళ్లలో రూపాయికిదే అత్యధిక వార్షిక క్షీణత. ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ నిధులు భారీగా తరలిపోవడం, ట్రంప్ సుంకాల పోటుతోపాటు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమయ్యాయి. 2025 ట్రేడింగ్ చివరి రోజున డాలర్-రూపాయి మారకం విలువ 13 పైసల నష్టంతో రూ.89.88 వద్ద ముగిసింది. వచ్చే ఏడాదిలోనూ రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని ఫారెక్స్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి