బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేదు.. 15 రోజుల్లో రూ. 15 లక్షల డెత్ క్లెయిమ్..
ABN , Publish Date - Feb 18 , 2026 | 09:04 PM
డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే డెత్ క్లెయిమ్ కోసం ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో సులభతర విధానాన్ని పరిచయం చేసింది. డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాదారులు చనిపోయిన సందర్భాల్లో వారి కుటుంబసభ్యులు లేదా వారసులు బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే డెత్ క్లెయిమ్ కోసం ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 15 లక్షల రూపాయల వరకు నగదు సెటిల్‌మెంట్‌కు ఎలాంటి థర్డ్ పార్టీ ష్యూరిటీ అవసరం లేదు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే క్లెయిమ్ సెటిల్‌మెంట్ పూర్తి అవ్వనుంది.
డెత్ క్లెయిమ్ పొందాలంటే.. ఐఓబీ పోర్టల్‌లో డెత్ క్లెయిమ్ విభాగంలోకి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ఫారం, ఖాతాదారుడి డెత్ సర్టిఫికెట్, నామినీ గుర్తింపు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఒక వేళ నామినీ లేని పక్షంలో ఇండెమ్నిటీ బాండ్, డిస్‌క్లెయిమర్ లెటర్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. కాగా, డెత్ క్లెయిమ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఏడాది కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మరణించిన వారి బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిబంధనలను సవరించింది.
ఇవి కూడా చదవండి
రాణించిన శివమ్ దూబె, నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే..
టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య