రూ.10 లక్షల కోట్లు
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:00 AM
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) నమోదిత కంపెనీల షేర్లలో భారత కోటీశ్వరుల (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్-హెచ్‌ఎన్‌ఐ) మొత్తం పెట్టుబడులు ఆల్‌టైం రికార్డు...
జూన్ చివరి నాటికి ఎన్‌ఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల్లో కోటీశ్వరుల పెట్టుబడులివి..
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) నమోదిత కంపెనీల షేర్లలో భారత కోటీశ్వరుల (హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్-హెచ్‌ఎన్‌ఐ) మొత్తం పెట్టుబడులు ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేవలం 3 నెలల్లోనే వీరి పెట్టుబడులు రూ.1.83 లక్షల కోట్ల మేర పెరిగాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం.. ఈ మార్చి చివరి నాటికి రూ.8.10 లక్షల కోట్లుగా నమోదైన కోటీశ్వరుల మొత్తం పెట్టుబడులు.. ఆ తర్వాత మూడు నెలల్లో 22.55 శాతం వృద్ధి చెంది జూన్ చివరి నాటికి రూ.9.92 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దాంతో ఎన్‌ఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల్లో భారత హెచ్‌ఎన్‌ఐల పెట్టుబడుల వాటా 1.99 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. 2022 మార్చి తర్వా త గరిష్ఠ స్థాయి ఇది. అంతేకాదు, హెచ్‌ఎన్‌ఐల పెట్టుబడులు కలిగిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్)లోనూ వారి వాటా 3.98 శాతం నుంచి 4.25 శాతానికి ఎగబాకింది. కోటీశ్వరులు అధికంగా పెట్టుబడులు పెట్టిన షేర్లలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ అగ్రస్థానంలో నిలవగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ తర్వాత స్థానంలో ఉంది.

సెప్టెంబరు త్రైమాసికంలో గృహ రుణాల
పోర్ట్‌ఫోలియోపై ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి ధీమా
గృహ రుణాల్లో తమ బ్యాంకు అగ్రగామి అని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. ఈ త్రైమాసికం (జూలై -సెప్టెంబరు)లో బ్యాంకు గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.10 లక్షల కోట్ల కీలక మైలురాయిని దాటనుందని అన్నారు. ఈ రుణాలకు ఉన్న బలమైన డిమాండ్ ఇందుకు దోహదపడనుందని శెట్టి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లోనే ఎస్‌బీఐ హోమ్‌లోన్ పోర్ట్‌ఫోలియో రూ.9 లక్షల కోట్లు దాటింది. ఈ రుణాల విభాగంలో ఎస్‌బీఐ దాదాపు 28 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. శెట్టి ఇంకా ఏమన్నారంటే..
దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుకు రుణాలను అందుబాటులోకి తీసుకురావటంపై ఎస్‌బీఐ దృష్టి సారించింది. ప్రస్తుతం ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 460కి పైగా హోమ్‌లోన్ ప్రాసెసింగ్ కేంద్రాలను కలిగి ఉంది.
కస్టమర్లు గృహ రుణం కోసం తమ బ్యాంకును ఆశ్రయించేందుకు రుణ రేట్లలో పారదర్శకతతో పాటు డాక్యుమెంటేషన్, ప్రాజెక్టుల తనిఖీలు సహా రుణ ప్రాసెసింగ్ ప్రక్రియపై విశ్వాసం వంటి అంశాలు ప్రధానంగా దోహదపడుతున్నాయి.
గృహ రుణాన్ని కేవలం బ్యాంకింగ్ ప్రొడక్టుగా చూడొద్దు. దేశ ఆర్థిక పురోగతితోపాటు కమర్షియల్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌పై ఆధారపడిన 200కు పైగా రంగాల వృద్ధికీ తోడ్పడుతుంది.
బ్యాంకింగ్ రంగంలో గృహ రుణాల సెక్యూరిటైజేషన్ రూ.30 లక్షల కోట్ల పై స్థాయిలో ఉండవచ్చు. కానీ, ఈ ఆస్తులను త్వరగా ద్రవ్య రూపంలోకి మార్చుకోవడానికి వీల్లేకపోవడం రుణ వితరణ పెంపు విషయంలో బ్యాంకు సామర్థ్యాన్ని పరిమితం చేస్తోంది.
ఆర్‌బీఐ ఫారెక్స్ రాయితీ ద్వారా రూ.96,000 కోట్ల విదేశీ నిధులు
ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన విదేశీ మారక రాయితీ సదుపాయం ద్వారా ఎస్‌బీఐ.. ప్రవాస భారతీయులు (ఎన్నారై), విదేశీ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 1,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.96,000 కోట్లు) మేర విదేశీ నిధులను ఆకర్షించనుందని సీఎస్ శెట్టి ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్ల సమీకరణలో డీలర్ బ్యాంకుల పూర్తి హెడ్జింగ్ ఖర్చులను భరించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..