ఈ ఏడాది మరో 100 శాఖలు
ABN , Publish Date - Aug 31 , 2026 | 02:31 AM
దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉనికిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టి సారించిన ఇండియన్ బ్యాంక్ ఈ ఏడాదిలో దాదాపు 100 కొత్త శాఖలను ప్రారంభించనుంది. కొత్తగా...
ఇండియన్ బ్యాంక్
చెన్నై: దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉనికిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టి సారించిన ఇండియన్ బ్యాంక్ ఈ ఏడాదిలో దాదాపు 100 కొత్త శాఖలను ప్రారంభించనుంది. కొత్తగా అలాగే పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల స్థానంలో దాదాపు 2,500 మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. గత ఏడాదిలో తాము 100 శాఖలను తెరిచామని, ఈ ఏడాది కూడా అలాంటి ప్రణాళికలే ఉన్నాయని ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ బినోద్ కుమార్ తెలిపారు. తమ బ్యాంకు ఆవిర్భావ దినోత్సవమైన ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 15 శాఖలను ప్రారంభించామని చెప్పారు. ఈ ఏడాది జూన్ చివరినాటికి బ్యాంకుకు దేశీయంగా 6,003 శాఖలు, విదేశాల్లో మూడు (సింగపూర్, కొలంబో, జాఫ్నా) శాఖలున్నాయి.
ఇవి కూడా చదవండి..
బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..
పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..