2025 మరియు 26లో వాహన విక్రయాలు 3 కోట్లు
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:27 AM
శంలో వార్షిక వాహన విక్రయాలు దాదాపు 3 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో అన్ని విభాగాల వాహనాల రిటైల్ విక్రయాలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి...
ఆల్‌టైం రికార్డు స్థాయి ఇది
జూగణాంకాలు విడుదల చేసిన ఫాడా
వెహికిల్‌పై వార్ ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: దేశంలో వార్షిక వాహన విక్రయాలు దాదాపు 3 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో అన్ని విభాగాల వాహనాల రిటైల్ విక్రయాలు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి 2,96,71,064 యూనిట్లకు పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) సోమవారం వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024-25)లో నమోదైన 2.61 కోట్లకు పైగా యూనిట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 13.3 శాతం పెరిగాయి. 2025-26 ప్రథమార్థంలో వాహన విక్రయాలు మందకొడిగానే సాగినప్పటికీ, జీఎ్‌సటీ తగ్గింపుతో పండగ సీజన్ (దసరా, దీపావళి) నుంచి అమ్మకాలు ఊపందుకోవడం ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం ఆరింటిలో నాలుగు విభాగాల వాహనాల విక్రయాలు ఆల్‌టైం రికార్డు స్థాయికి పెరిగాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ అన్నారు. దాంతో పరిశ్రమ మొత్తం విక్రయాలు మూడు కోట్లకు చేరువయ్యాయని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో వాహన గిరాకీపై ఫాడా జాగ్రత్తతో కూడిన ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో మున్ముందు పరిస్థితులు, ఇంధన ధరలపై వాటి ప్రభావం, కొనుగోలుదారుల్లో విశ్వాసం వంటి అంశాలపై భవిష్యత్ గిరాకీ ఆధారపడి ఉందని అసోసియేషన్ ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్ అన్నారు. యుద్ధ పరిణామాలు కస్టమర్ల కొనుగోలు ప్రాధాన్యతను సంప్రదాయ ఇంధన వాహనాల నుంచి సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మళ్లించవచ్చని అసోసియేషన్ పేర్కొంది.
విభాగం విక్రయాలు వృద్ధి
2025-26 2024-25 (%)
ప్యాసింజర్ వాహనాలు 47,05,056 41,63,927 13.00
ద్విచక్ర వాహనాలు 2,14,20,386 1,88,89,595 13.40
త్రిచక్ర వాహనాలు 13,63,412 12,20,834 11.68
వాణిజ్య వాహనాలు 10,60,906 9,49,406 11.74
ఈ వార్తలూ చదవండి:
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..