పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌లో సవరణలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:37 AM
ప్రధాన మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త అర్హత గడువును నిర్దేశించడంతో...
ఈవీ ప్రోత్సాహకాలపై పరిమితులు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త అర్హత గడువును నిర్దేశించడంతో పాటు విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అందించే సబ్సిడీపైనా పరిమితులు విధించింది. 2026 జూలై 31 వరకు రిజిస్టర్ చేసుకునే ఎలక్ట్రిక్ టూవీలర్లు, 2028 మార్చి 31 వరకు రిజిస్టర్ చేసుకునే ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు మాత్ర మే ఈ పథకం కింద ప్రోత్సాహకాలు లభించనున్నా యి. అంతేకాదు, రూ.1.5 లక్షల వరకు (ఎక్స్-ఫ్యాక్టరీ) ధర కలిగిన ఎలక్ట్రిక్ టూవీలర్లు, రూ.2.5 లక్షల వరకు విలువైన ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు మాత్రమే ఈ పథకం ద్వారా సబ్సిడీ లభించనుంది. 2028 మార్చి 31 గడువుతో కూడిన ఈ పథకం ద్వారా సబ్సిడీ చెల్లింపులకు కేంద్రం రూ.10,900 కోట్లు కేటాయించింది. నిధులను మరింత పెంచే అవకాశం లేదని స్పష్టం చేసింది. అంటే, గడువుతో సంబంధం లేకుండా సబ్సిడీ చెల్లింపుల మొత్తం రూ.10,900 కోట్లకు చేరుకోగానే పథకం పూర్తవుతుంది.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు