Share News

స్థిరాస్తి మార్కెట్‌ దూకుడు

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:33 AM

అప్పుడప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉన్నా దేశంలో స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్‌ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. 2030 నాటికి ఈ మార్కెట్‌ రూ.88 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని..

స్థిరాస్తి మార్కెట్‌ దూకుడు

2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు

న్యూఢిల్లీ: అప్పుడప్పుడు కొన్ని ఆటుపోట్లు ఉన్నా దేశంలో స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్‌ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. 2030 నాటికి ఈ మార్కెట్‌ రూ.88 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ-నరెడ్కో ఒక నివేదికలో తెలిపాయి. గత ఏడాది నమోదైన రూ.26.4 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2047 నాటికి ఇది మరింత పెరిగి రూ.440.5 లక్షల కోట్ల నుంచి రూ.616.7 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని కేపీఎంజీ ఇండియా గ్లోబల్‌ విభాగం హెడ్‌ నీరజ్‌ బన్సాల్‌ చెప్పారు. ‘ది రోల్‌ ఆఫ్‌ ది రియల్‌ ఎస్టేట్‌ ఇన్‌ వికసిత్‌ భారత్‌, 2047’ పేరుతో ఈ సంస్థలు ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేశాయి. వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో స్థిరాస్తి రంగం వెన్నెముకగా మారనుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 05:33 AM