Share News

ఫిబ్రవరి 4-9 తేదీల్లో భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2027

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:58 AM

వచ్చే ఏడాది ఫిబ్రవరి 4-9 తేదీల్లో ఢిల్లీ వేదికగా భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో జరగనుంది.

ఫిబ్రవరి 4-9 తేదీల్లో    భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2027
mobility

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 4-9 తేదీల్లో ఢిల్లీ వేదికగా భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో 50కి పైగా దేశాల నుంచి 1,750 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. ఆటో షోలో భాగంగా ఆటోమొబైల్‌ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు కొత్త ఉత్పత్తులను విడుదల చేయటంతో పాటు వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. ‘స్మార్టర్‌ మొబిలిటీ ఫర్‌ ఏ బెటర్‌ టుమారో’ థీమ్‌తో ఈ ఎక్స్‌పోను నిర్వహించనున్నారు

Updated Date - Nov 11 , 2026 | 06:29 AM