Share News

దేశంలో ఎల్‌ఎన్‌జీ కొరత

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:41 AM

ఇరాన్‌ దాడుల కారణంగా ఖతార్‌ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులను నిలిపి వేసింది. దీంతో ఆ దేశం నుంచి మన దేశానికి ఎల్‌ఎన్‌జీ దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. మన దేశానికి అవసరమైన ఎల్‌ఎన్‌జీ అవసరాల్లో 40% ఖతార్‌ నుంచే దిగుమతవుతోంది. తాజా...

దేశంలో ఎల్‌ఎన్‌జీ కొరత

40% కోత పెట్టిన పెట్రోనెట్‌ జూవంట గ్యాస్‌కి పొంచి ఉన్న ముప్పు

న్యూఢిల్లీ: ఇరాన్‌ దాడుల కారణంగా ఖతార్‌ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులను నిలిపి వేసింది. దీంతో ఆ దేశం నుంచి మన దేశానికి ఎల్‌ఎన్‌జీ దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. మన దేశానికి అవసరమైన ఎల్‌ఎన్‌జీ అవసరాల్లో 40% ఖతార్‌ నుంచే దిగుమతవుతోంది. తాజా పరిణామాలతో దేశంలోని సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు; ఎరువులు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులకు ఎల్‌ఎన్‌జీ సరఫరాల్లో 40 శాతం కోత విధిస్తున్నట్టు పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ ప్రకటించింది. ఇదే సమయంలో స్పాట్‌ మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జీ ధర రెట్టింపైంది. ఇంత ధర పెట్టి కొన్నా, హార్మోజ్‌ జల సంధి మూసివేతతో అది మన తీరానికి చేరే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ ఈ అడ్డంకులను అధిగమించి దిగుమతి చేసుకున్నా, కొనేందుకు సీజీడీలు, పారిశ్రామిక సంస్థలు ముందుకు రావడం లేదు.

వంట గ్యాస్‌కీ కష్టాలే: వంట గ్యాస్‌కీ కొరత ముంచుకొస్తోంది. దేశంలో వినియోగించే వంట గ్యాస్‌లో 90 శాతానికి దిగుమతులే దిక్కు. ఇందులో పెద్ద మొత్తం సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈల నుంచి దిగుమతవుతోంది. ఇరాన్‌ దాడులతో ఈ దేశాల నుంచి ఎల్‌పీజీ దిగుమతులు ఆగిపోయాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న నిల్వలు నెల రోజులకు మించి రావని అంచనా. దీంతో ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలనే అంశంపై అధికార వర్గాలు, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి దిగుమతికి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధరలు కొండెక్కా యి. దీనికి తోడు గల్ఫ్‌ దే శాల నుంచి ఐదారు రోజు ల్లో వచ్చే ఎల్‌పీజీ నౌకలు, భారత్‌కు చేరేందుకు నెల నుంచి నెలన్నర పడుతుందని సమాచారం.

ఇవీ చదవండి:

ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..

జీడీపీకి చమురు సెగ

Updated Date - Mar 05 , 2026 | 05:41 AM