Share News

జెట్‌ ఇంధన ధరల స్థిరీకరణ పథకానికి స్పందన కరువు

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:52 AM

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోవడంతో విమానయాన సంస్థలపై జెట్‌ ఇంధన (ఏటీఎఫ్‌) భారాన్ని తగ్గించేందుకు...

జెట్‌ ఇంధన ధరల స్థిరీకరణ పథకానికి స్పందన కరువు

ఒప్పందానికి ఎయిర్‌లైన్స్‌ ముందుకురాని వైనం

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోవడంతో విమానయాన సంస్థలపై జెట్‌ ఇంధన (ఏటీఎఫ్‌) భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రకటించిన రూ.10,000 కోట్ల జెట్‌ ఇంధన ధరల స్థిరీకరణ పథకానికి స్పందన కరువైంది. ఇప్పటి వరకు ఈ పథకంలో చేరేందుకు ఒక్క ఎయిర్‌లైన్‌ సంస్థ కూడా ఒప్పందం చేసుకోలేదని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివస్తుండటమే ఇందుకు కారణమై ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్ణీత ధర వద్ద ఎయిర్‌లైన్స్‌కు మూడేళ్ల వరకు ఏటీఎఫ్‌ను సరఫరా చేసే ప్రభుత్వరంగ ఇంధన విక్రయ కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు రూ.10,000 కోట్లతో కూడిన పథకానికి గత నెలలో కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో విమానయాన కంపెనీలు చేరడం స్వచ్ఛందమే. అయితే లీటరుకు రూ.115 చెల్లించి ఏటీఎ్‌ఫను పొందడానికి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో విమానయాన సంస్థలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎయిర్‌లైన్‌ సంస్థ కూడా ఈ పథకానికి సంబంధించి సంతకం చేయలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ఇవి కూడా చదవండి..


మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Updated Date - Jul 03 , 2026 | 02:52 AM