Share News

పెట్రోల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:59 AM

జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోల్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అదే సమయంలో డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతులపై...

పెట్రోల్‌పై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు

డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై తగ్గింపు

న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోల్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అదే సమయంలో డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ఎగుమతులపై పన్నును తగ్గించింది. పెట్రోల్‌ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని (ఎస్‌ఏఈడీ) లీటరుకు రూ.1.5 నుంచి రూ.4కు పెంచిన కేంద్రం.. డీజిల్‌పై ఎస్‌ఏఈడీని లీటరుకు రూ.14 నుంచి రూ.8.5కు, ఏటీఎ్‌ఫపై ఎస్‌ఏఈడీని లీటరుకు రూ.12.5 నుంచి రూ.7.5కు తగ్గించింది. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ఈ మార్చి 27 నుంచి ఇంధన కంపెనీలపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను విధిస్తోంది. ప్రతి 15 రోజులకోసారి దీన్ని సవరిస్తోంది. ఇంధన ఎగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా దేశీయంగా వీటి లభ్యతను పెంచేందుకు కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను విధిస్తోంది.

ఇవి కూడా చదవండి..

రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

Updated Date - Jul 01 , 2026 | 05:59 AM