Share News

ఇళ్ల అమ్మకాలకూ యుద్ధ గండం

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:37 AM

పశ్చిమాసియా సంక్షోభం.. భారత స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జనవరి- మార్చి మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు...

ఇళ్ల అమ్మకాలకూ యుద్ధ గండం

మార్చి త్రైమాసికంలో 7% క్షీణత

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం.. భారత స్థిరాస్తి రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది జనవరి- మార్చి మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే 7 శాతం క్షీణించాయి. అక్టోబరు త్రైమాసికంలో 1,08,970 యూనిట్లు అమ్ముడవగా, మార్చి త్రైమాసికంలో అమ్మకాలు 1,01,675 యూనిట్లకు పరిమితయ్యాయి. విలువ పరంగా చూసినా 6ు క్షీణించి రూ.1.60 లక్షల కోట్ల నుంచి రూ.1.51 లక్షల కోట్లకు తగ్గినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ తాజా నివేదికలో వెల్లడించింది. అయితే వార్షిక ప్రాతిపదికన మాత్రం ఇళ్ల అమ్మకాలు 9ు పెరిగినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో 93,280 ఇళ్లు అమ్ముడుపోయాయి. విలువ పరంగా 6ువృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, నిర్మాణ వ్యయం భారమవడం వంటివి మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని అనరాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి అన్నారు. నివాస గృహాల విభాగంలో దీర్ఘకాలిక ఫండమెంటల్స్‌ బలంగానే ఉన్నప్పటికీ మార్చి నెలలో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబించడం ఈ క్షీణతకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతాలకు చెందిన కొనుగోలుదారులు ప్రధానంగా భారత రియల్టీలో పెట్టుబడులు పెడతారని, యుద్ధ ప్రభావంతో వారు కొనుగోళ్లకు విరామం ఇచ్చారని ఆయన అన్నారు.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 30 , 2026 | 02:37 AM