Share News

2030 నాటికి హెల్త్‌కేర్‌, ఫార్మాలో 25 లక్షల నియామకాలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:15 AM

దేశంలో హెల్త్‌కేర్‌, ఫార్మా రంగా లు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో 2030 నాటికి ఈ రెండు రంగాల్లో ఎంత లేదన్నా...

2030 నాటికి హెల్త్‌కేర్‌, ఫార్మాలో 25 లక్షల నియామకాలు

అడెక్కో ఇండియా

న్యూఢిల్లీ: దేశంలో హెల్త్‌కేర్‌, ఫార్మా రంగా లు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో 2030 నాటికి ఈ రెండు రంగాల్లో ఎంత లేదన్నా 20 లక్షల నుంచి 25 లక్షల కొత్త నియామకాలు జరుగుతాయని అడెక్కో ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. తన సేవలు అందుకునే వంద మందికి పైగా క్లయింట్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అడెక్కో ఈ నివేదిక రూపొందించింది. వీరిలో 30 నుంచి 35ు మందిని మారుతున్న ఉద్యోగాసరాలకు అనుగుణంగా రీస్కిల్లింగ్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రధానాంశాలు..

  • బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లోనే 65-70ు నియామకాలు

  • 2022 నాటికి జీడీపీలో 3.3 శాతంగా ఉన్న హెల్త్‌కేర్‌, ఫార్మా వాటా 2030 నాటికి 5 శాతానికి

  • అభివృద్ధికి తోడ్పడనున్న క్లినికల్‌ రీసెర్చ్‌, డిజిటల్‌ హెల్త్‌, ఫార్మా గ్లోబల్‌ ఔట్‌సోర్సింగ్‌

  • అత్యాధునిక ఆర్‌ అండ్‌ డీ, రెగ్యులేటరీ రంగాల్లో 25-30 శాతం పెరగనున్న నియామకాలు

  • వచ్చే 5-7 ఏళ్లలో హెల్త్‌కేర్‌, ఫార్మా రంగాల నిపుణుల ప్రధాన అంతర్జాతీయ సరఫరాదారు కానున్న భారత్‌

ఈ వార్తలూ చదవండి:

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

ఈసారికి రెపో యథాతథమే!

Updated Date - Apr 07 , 2026 | 03:15 AM