అపోలో మైక్రో, జెన్ టెక్నాలజీలకు ఆయుధ తయారీ లైసెన్సులు
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:55 AM
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెండు రక్షణ రంగ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆయుధాల తయారీ లైసెన్సులు మంజూరు చేసింది. అపోలో మైక్రో సిస్టమ్స్...
హైదాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే రెండు రక్షణ రంగ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆయుధాల తయారీ లైసెన్సులు మంజూరు చేసింది. అపోలో మైక్రో సిస్టమ్స్, జెన్ టెక్నాలజీస్ కంపెనీలు ఈ లైసెన్సులు అందుకున్నాయి. ఈ లైసెన్సు కింద జెన్ టెక్నాలజీస్.. వైమానిక, నౌకా దళాలకు అవసరమైన ర్యాపిడ్ ఫైర్ 12.7 ఎంఎం, 23 ఎంఎం, 30 ఎంఎం, 40 ఎంఎం ఫిరంగులు తయారు చేస్తుంది. వీటిని డ్రోన్ల కూల్చివేతకు కూడా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. ఇక అపోలో మైక్రో సిస్టమ్స్‌కి లభించిన లైసెన్సు కింద మిస్సైల్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, టార్పెడో లు, అండర్ వాటర్ మైన్స్, గైడెడ్ వెపన్స్, అండర్‌వాట ర్ సిస్టమ్స్, ఏరియల్ బాంబులు, రాకెట్లు తయారు చేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..