లక్ష్యం దాటిన పన్ను వసూళ్లు
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:18 AM
ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న పన్ను వసూళ్ల లక్ష్యాన్ని స్వల్పంగా దాటింది. సవరించిన అంచనాల ప్రకారం...
న్యూఢిల్లీ: ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న పన్ను వసూళ్ల లక్ష్యాన్ని స్వల్పంగా దాటింది. సవరించిన అంచనాల ప్రకారం ప్రభుత్వం రూ.15.52 లక్షల కోట్ల పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎ్‌సటీ) వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కస్టమ్స్ సుంకంగా రూ.2.58 కోట్ల లక్ష్యం పెట్టుకోగా పన్ను వసూలు 102ు ఉంది. ఎక్సైజ్ సుంకం 101% నమోదు కాగా కేంద్ర జీఎ్‌సటీ 100.8% వచ్చింది. అయితే ఏ పన్ను ఎంత మొత్తం వసూలైందో రూపాయల్లో ప్రకటించలేదు. పాన్ మసాలా తయారీపై విధించిన హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ వసూళ్లు మాత్రం నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోలేదని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News