Share News

భారత్‌లో భారీగా డిజిటల్‌ మోసాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 03:18 AM

గత ఏడాది (2025) భారత వినియోగదారులు డిజిటల్‌ మోసాల్లో నష్టపోయిన సగటు సొమ్ము 2,265 డాలర్లని (దాదాపు రూ.2.04 లక్షలు) ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక వెల్లడించింది....

భారత్‌లో భారీగా డిజిటల్‌ మోసాలు

ప్రపంచ సగటుతో పోలిస్తే రెండింతలు ఎక్కువ

మోసపోయిన సగటు సొమ్ము 36ు అధికం

ట్రాన్స్‌యూనియన్‌ సర్వే వెల్లడి

ముంబై: గత ఏడాది (2025) భారత వినియోగదారులు డిజిటల్‌ మోసాల్లో నష్టపోయిన సగటు సొమ్ము 2,265 డాలర్లని (దాదాపు రూ.2.04 లక్షలు) ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచ సగటు 1,671 డాలర్లతో పోలిస్తే 36 శాతం అధికమని తెలిపింది. అలాగే, గత ఏడాది భారత్‌లో డిజిటల్‌ మోసం రేటు 7.1 శాతంగా నమోదైందని, ప్రపంచ సగటు 3.8 శాతంతో పోలిస్తే దాదాపు రెండింతలని వెల్లడించింది. అయితే, 2024లో నమోదైన 13.1 శాతంతో పోలిస్తే గత ఏడాది దేశంలో డిజిటల్‌ మోసాల రేటు దాదాపు సగానికి తగ్గింది. వినియోగదారుల్లో డిజిటల్‌ అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం, ఇండస్ట్రీ వర్గాలు చేపట్టిన చర్యలతో పాటు కస్టమర్లలో అవగాహన పెరగడం, ఫోన్‌ నంబర్ల వెరిఫికేషన్‌, సైబర్‌ ఇంటలిజెన్స్‌ షేరింగ్‌ వంటి చర్యల ఫలితమే ఇదని ట్రాన్స్‌యూనియన్‌ పేర్కొంది.

  • దేశంలో ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు డిజిటల్‌ మోసాల బారిన పడుతున్నారని రిపోర్టు తెలిపింది. గత ఏడాది ఆగస్టు-డిసెంబరు మధ్య కాలంలో సైబర్‌ నేరగాళ్లు తమను మోసగించేందుకు ప్రయత్నించారని సర్వేలో పాల్గొన్న 59 శాతం మంది వెల్లడించారు.

  • డిజిటల్‌ మోసానికి బలైనట్లు 13 శాతం మంది తెలిపారు. ప్రపంచ సగటు 10 శాతం కంటే అధికం ఇది.

  • భారత్‌లో అత్యధికం ఫిషింగ్‌ మోసాల బాధితులే. విషింగ్‌, స్మిషింగ్‌, ఈ-కామర్స్‌ సైట్లలో థర్డ్‌ పార్టీ సెల్లర్‌ స్కామ్‌ల బారిన కూడా పడినట్లు దేశీయ వినియోగదారులు తెలిపారు.

  • భారత్‌లో అధికంగా లాగిన్‌ దశలోనే డిజిటల్‌ మోసాల ముప్పును ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది.

  • 2024తో పోలిస్తే దేశంలో ఆన్‌లైన్‌ ద్వారా మోసగించే ప్రయత్నాలు కాస్త తగ్గినప్పటికీ, డిజిటల్‌ సేవల వినియోగం శరవేగంగా పెరుగుతున్న తరుణంలో గుర్తింపు ఆధారిత స్కామ్స్‌, నకిలీల సృష్టితో ఇప్పటికీ గణనీయ ముప్పు పొంచి ఉందని ట్రాన్స్‌యూనియన్‌ హెచ్చరించింది.


డిజిటల్‌ మోసం రేటు

అధికంగా ఉన్న రంగాలు

రంగం శాతం

లాజిస్టిక్స్‌ 16.3

టెలికాం 14.7

ఇన్సూరెన్స్‌ 11.5

ఆన్‌లైన్‌ గేమింగ్‌ 9.6

ఆన్‌లైన్‌ డేటింగ్‌, ఫోరమ్స్‌

తదితర కమ్యూనిటీలు 4.7

ఆర్థిక సేవలు 2.6

రిటైల్‌ 2.5

2024-25 మధ్యకాలంలో డిజిటల్‌

మోసాలు అధికంగా పెరిగిన రంగాలు

రంగం పెరుగుదల (ు)

టెలికాం 308

ఇన్సూరెన్స్‌ 145

లాజిస్టిక్స్‌ 31

ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 17 , 2026 | 03:18 AM