Share News

2030 నాటికి రూ.2 లక్షల కోట్లకు డిజిటల్‌ యాడ్‌ మార్కెట్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:54 AM

దేశంలో డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ మార్కెట్‌ 2030 నాటికి రెట్టింపై 2,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.05 లక్షల కోట్లు)కు చేరుతుందని మార్కెట్‌....

2030 నాటికి రూ.2 లక్షల కోట్లకు డిజిటల్‌ యాడ్‌ మార్కెట్‌

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ మార్కెట్‌ 2030 నాటికి రెట్టింపై 2,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.05 లక్షల కోట్లు)కు చేరుతుందని మార్కెట్‌ పరిశోధన సంస్థ రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ అంచనా. అప్పటికి ప్రపంచ మార్కెట్‌ 1.2 లక్ష కోట్ల డాలర్లు దాటుతుందని తాజా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఈ మార్కెట్‌ పరిమాణం 1,100 కోట్ల డాలర్లుంది. డిజిటల్‌ యాడ్‌ వ్యయాలు మొత్తం అడ్వర్‌టైజ్‌మెంట్‌ వ్యయాల్లో 70-75 శాతం ఉన్న ట్టు పేర్కొంది. 2025లో ప్రపంచ జీడీపీ కన్నా డిజిటల్‌ యాడ్‌ వ్యయాలు 3-5 రెట్లు అధిక వృద్ధిని నమోదు చేస్తున్నట్టు తెలిపింది. ప్రపంచంలో డిజిటల్‌ యాడ్‌ వ్యయాల్లో 46ు వాటాతో అమెరికా అగ్రస్థానంలో, 24ు వాటాతో చైనా ద్వితీయ స్థానంలో ఉండగా భారత్‌ వాటా కేవలం 1 శాతమని రెడ్‌సీర్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ మాధవ్‌ గులాటి అన్నారు. డిజిటల్‌ యాడ్‌ వ్యయ విభాగంలో మొబైల్‌ యాడ్‌లు 65ు వాటా కలిగి ఉన్నాయని, అందులో యాప్‌లో భాగంగా వచ్చే ప్రకటనల వాటా 80-85ు ఉంటుందని ఆ నివేదిక స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 04:54 AM