పడకేసిన కీలక రంగాలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:43 AM
దేశీయ పారిశ్రామిక పురోగతికి కీలకమైన 8 రంగాల (బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్, ఎరువులు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు) ఉత్పత్తి భారీగా తగ్గింది...
మార్చిలో మైనస్ 0.4 శాతానికి ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక పురోగతికి కీలకమైన 8 రంగాల (బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్, ఎరువులు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు) ఉత్పత్తి భారీగా తగ్గింది. ఈ మార్చిలో ఈ రంగాల్లో ఉత్పత్తి మైనస్ 0.4 శాతానికి పడిపోయింది. ఉత్పత్తి మైనస్ స్థాయికి పడిపోవడం గడిచిన ఐదు నెలల్లో ఇదే మొదటిసారి. బొగ్గు, ముడిచమురు, ఎరువులు, విద్యుత్ రంగాలు పేలవ పనితీరు కనబరచడం ఇందుకు ప్రధాన కారణం. ఈ ఫిబ్రవరిలో కీలక రంగాల ఉత్పత్తిలో 2.8 శాతం వృద్ధి నమోదైంది. కాగా, ఈ మార్చి 31తో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో కీలక రంగాల వృద్ధి రేటు 2.6 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఇది 4.5 శాతంగా నమోదైంది.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News