Share News

విమానయానానికి భవిష్యత్‌ భేష్‌

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:35 AM

భారత్‌లో విమానయానానికి మంచి భవిష్యత్‌ ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. వింగ్స్‌ ఇండియా 2026 ఏవియేషన్‌ సమ్మిట్‌ను...

విమానయానానికి భవిష్యత్‌ భేష్‌

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత్‌లో విమానయానానికి మంచి భవిష్యత్‌ ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. వింగ్స్‌ ఇండియా 2026 ఏవియేషన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. విమాన విడిభాగాలు, ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ మన కంపెనీలు సత్తా చాటాలని కోరారు. ఇందుకు అనువైన సానుకూల పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వ పరం గా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సత్తా మన దేశానికి ఉందన్నారు.

వేగంగా అభివృద్ధి: ప్రస్తుతం మన వైమానిక రంగంలో ఉన్నంత వృద్ధి రేటు మరే దేశంలోనూ లేదని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ విమానయాన కంపెనీలు ఇప్పటికే 1,500కు పైగా విమానాలకు బోయింగ్‌, ఎయిర్‌బస్‌, ఎంబ్రాయర్‌ కంపెనీలకు ఆర్డర్‌ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో దేశీయంగా వైమానిక ఉత్పత్తుల తయారీకి మరింత ప్రోత్సాహం లభించనుందన్నారు. బోయింగ్‌, ఎయిర్‌బస్‌ కంపెనీలు ఇప్పటికే మన దేశం నుంచి ఏటా 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.18,300 కోట్లు) విలువైన విమాన విడిభాగాలను దిగుమతి చేసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి:

ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

Updated Date - Jan 29 , 2026 | 07:09 AM