2031 నాటికి భారత్‌లో 110 కోట్లకు 5జీ కనెక్షన్లు
ABN , Publish Date - Jun 17 , 2026 | 02:55 AM
భారత్‌లో 2031 చివరి నాటికి 5జీ సబ్‌స్ర్కిప్షన్ల సంఖ్య 110 కోట్లు దాటే అవకాశం ఉందని స్వీడన్‌కు చెందిన టెలికాం గేర్ తయారీ సంస్థ...
ఎరిక్సన్ అంచనా
న్యూఢిల్లీ: భారత్‌లో 2031 చివరి నాటికి 5జీ సబ్‌స్ర్కిప్షన్ల సంఖ్య 110 కోట్లు దాటే అవకాశం ఉందని స్వీడన్‌కు చెందిన టెలికాం గేర్ తయారీ సంస్థ ఎరిక్సన్ నివేదిక అంచనావేసింది. అప్పటికి దేశంలోని మొత్తం చందాదారుల్లో వీటి వాటా 81 శాతం ఉండవచ్చని పేర్కొంది. 2025 చివరినాటికి దేశంలో 5జీ కనెక్షన్లు 43 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం మొబైల్ సబ్‌స్ర్కిప్షన్లలో వీటి వాటా 35 శాతంగా ఉందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక పేర్కొంది. మొబైల్ డేటా వినియోగంలోనూ భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే నెలకు సగటున వినియోగం 37 జీబీలుగా ఉంది. ఇది 2031 నాటికి దాదాపు రెండింతలు పెరిగి 70 జీబీలకు చేరుకోనుందని అంచనా. దేశంలో 5జీ వినియోగం వేగంగా పెరుగుతుండటం, అందుబాటు ధరల్లో 5జీ స్మార్ట్ ఫోన్లు లభించడమే ఇందుకు కారణం.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..