Share News

రుణ పత్రాల ద్వారా రూ.2,000 కోట్లు

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:31 AM

IIFL Finance Launches ₹2,000 Crore NCD Issue with Up to 9 percent Interest

రుణ పత్రాల ద్వారా రూ.2,000 కోట్లు

నేటి నుంచి సబ్‌స్ర్కిప్షన్‌ ప్రారంభం.. ఐఐఎ్‌ఫఎల్‌ ఫైనాన్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాపార అభివృద్ధి కోసం ఐఐఎ్‌ఫఎల్‌ ఫైనాన్స్‌ నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల మొత్తాన్ని నాన్‌ కన్వర్టబుల్‌ రుణ పత్రాల (ఎన్‌సీడీ) ద్వారా సమీకరించబోతోంది. ఒక్కోటి రూ.1,000 ముఖ విలువ ఉన్న ఈ రుణ పత్రాల జారీ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ జోనల్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చెప్పారు. రెండు, మూడు, ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేస్తున్న ఈ రుణ పత్రాలపై ఐఐఎ్‌ఫఎల్‌ ఫైనాన్స్‌ 9 శాతం వరకు వడ్డీ ఆఫర్‌ చేస్తోంది. మదుపరులు ఈ వడ్డీని నెలనెలా, ఏడాదికి ఒకసారి లేదా రుణ పత్రాల కాల పరిమితి ముగిసిన తర్వాత అసలుతో కలిపి ఒకేసారి తీసుకోవచ్చని శ్రీకాంత్‌ చెప్పారు. రిటైల్‌ మదుపరులు కనీసం రూ.10,000 విలువైన పది బాండ్ల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ వచ్చే నెల 4న ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 05:31 AM