ఐడీబీఐ బ్యాంకు కోసం రివైజ్డ్ బిడ్స్ !
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:28 AM
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను ఎలాగైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బ్యాంకు ఈక్విటీలో మెజారిటీ వాటా...
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను ఎలాగైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం బ్యాంకు ఈక్విటీలో మెజారిటీ వాటా కొనుగోలు కోసం ఇప్పటికే బిడ్స్ వేసిన రెండు సంస్థలను, కొనుగోలు ధర పెంచాలని కోరనున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ సంస్థలు ఆఫర్ చేసిన ధర, ప్రభు త్వం నిర్ణయించిన కనీస ధర కంటే తక్కువగా ఉండ డం ఇందుకు ప్రధాన కారణం. మళ్లీ కొత్తగా బిడ్స్ పిలవడం కంటే, ఈ పద్దతిలో వెళితేనే ప్రైవేటీకరణ త్వరగా పూర్తవుతుందని అధికార వర్గాలు భావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..