ఐసీఐసీఐ ప్రు ఫ్లెక్సీక్యాప్‌తో మెరుగైన రిటర్నులు
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:08 AM
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. 2021 జూలై 17న ప్రారంభమైన ఈ ఫండ్ మదుపరులకు ఇప్పటి వరకు...
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. 2021 జూలై 17న ప్రారంభమైన ఈ ఫండ్ మదుపరులకు ఇప్పటి వరకు మెరుగైన రిటర్నులు అందించింది. లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ఓపెన్ ఎండెడ్ డైనమిక్ ఈక్విటీ పథకం. ఈ ఫండ్ ప్రారంభించిన సమయంలో ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడిగా పెడితే ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆ మొత్తం సుమారు రూ.19.61 లక్షలకు చేరింది. ఏటా సగటున 14.55 శాతం రిటర్నులు అందించింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ బీఎ్‌సఈ 500 టీఆర్‌ఐ మాత్రం సగటున 11.88 శాతం రిటర్నులు మాత్రమే అందించింది. ఇక సిప్ రూపంలో అయితే నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే.. మొత్తం పెట్టుబడి రూ.6 లక్షలకు చేరుకోగా.. ప్రస్తుతం ఆ మొత్తం రూ.8.47 లక్షలకు చేరుకుంది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!