ఐసీఐసీఐ బ్యాంక్ లాభంలో 9 శాతం వృద్ధి
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:16 AM
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 9.28 శాతం వృద్ధితో...
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 9.28 శాతం వృద్ధితో రూ.14,755 కోట్లకు పెరిగింది. సమీక్షా కాలానికి బ్యాంక్ కేటాయింపులు 90 శాతం మేర తగ్గడం ఇందుకు దోహదపడింది. క్యూ4లో బ్యాంక్ స్టాండలోన్ లాభం 8.5 శాతం పెరుగుదలతో రూ.13,702 కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్