ఐఎఫ్ఏసీ బోర్డు సభ్యుడిగా ఐసీఏఐ అధ్యక్షుడు ప్రసన్న కుమార్
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:47 AM
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు సీఏ ప్రసన్న కుమార్.. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్..
హైదరాబాద్, విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు సీఏ ప్రసన్న కుమార్.. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎ్‌ఫఏసీ) బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 17న దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఐఎ్‌ఫఏసీ కౌన్సిల్ సమావేశంలో ప్రసన్న కుమార్‌ను బోర్డు సభ్యుడిగా ఎన్నుకున్నారు. మూడేళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎఫ్ఏసీ బోర్డుకు ఎన్నికైన తొలి చార్టర్డ్ అకౌంటెంట్.. ప్రసన్న కుమార్ కావటం విశేషం. కాగా ఐసీఏఐ ఉపాధ్యక్షుడు సీఏ మంగేశ్ కినారే.. ఐఎఫ్ఏసీ బోర్డులో ఆయనకు సాంకేతిక సలహాదారుగా వ్యవహరించనున్నారు. 1984లో సీఏ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన టారిన్ రుల్టన్ ఐఎఫ్ఏసీ ప్రెసిడెంట్‌గా, అమెరికాకు చెందిన కాథరిన్ బైర్న్ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. వీరు రెండేళ్లపాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..