Share News

హ్యుండయ్‌తో టీవీఎస్‌ జట్టు

ABN , Publish Date - Apr 21 , 2026 | 06:45 AM

దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుండయ్‌ మోటార్‌ కంపెనీతో దేశీయ ఆటో కంపెనీ టీవీఎస్‌ మోటార్‌ జట్టు కట్టింది. సోమవారం కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం...

హ్యుండయ్‌తో టీవీఎస్‌ జట్టు

సంయుక్తంగా విద్యుత్‌ త్రిచక్ర వాహనాల అభివృద్ధి, తయారీ

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుండయ్‌ మోటార్‌ కంపెనీతో దేశీయ ఆటో కంపెనీ టీవీఎస్‌ మోటార్‌ జట్టు కట్టింది. సోమవారం కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం ఒప్పందం ద్వారా ఇరు కంపెనీలు కలిసి విద్యుత్‌ త్రిచక్ర వాహనాల అభివృద్ధి, దేశీయంగా తయారీతోపాటు భారత్‌ సహా ఇతర వర్థమాన దేశాల్లో వీటిని విక్రయించనున్నాయి. అగ్రిమెంట్‌లో భాగంగా హ్యుండయ్‌ మోటార్‌ తన ఆర్‌ అండ్‌ డీ నైపుణ్యం, ఆధునిక మొబిలిటీ టెక్నాలజీలు, మానవ కేంద్రీకృత విధానం ద్వారా ఎలక్ట్రిక్‌ త్రీవీలర్ల డిజైనింగ్‌కు నేతృత్వం వహించడంతోపాటు అభివృద్ధిలోనూ భాగస్వామ్య పాత్ర పోషించనుంది. ఇక టీవీఎస్‌ మోటార్‌ వాహన అభివృద్ధి కోసం తన ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ ప్లాట్‌ఫామ్‌, ఇంజనీరింగ్‌ అనుభవం, స్థానిక మార్కెట్‌ జ్ఞానాన్ని సమకూర్చడంతో పాటు దాని తయారీ, విక్రయాలు, భవిష్యత్‌లో ఎగుమతులకు నేతృత్వం వహించనుంది. ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ సెగ్మెంట్లో టీవీఎస్‌ ఇప్పటికే ప్యాసింజర్‌ వెహికిల్‌ మోడల్‌ ‘కింగ్‌ ఈవీ మ్యాక్స్‌’ సరుకు రవాణాకు ఉపయోగించే ‘కింగ్‌ కార్గో హెచ్‌డీ ఈవీ’ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది.

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 06:45 AM