Share News

హ్యుండయ్‌ కార్ల ధరల పెంపు

ABN , Publish Date - May 28 , 2026 | 02:37 AM

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌).. మరోసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది...

హ్యుండయ్‌ కార్ల ధరల పెంపు

జూన్‌ నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ : హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌).. మరోసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.12,800 వరకు ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది. ఈ ధరల పెంపు వేరియంట్‌, మోడల్‌ను బట్టి మారుతుందని, జూన్‌ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న ముడిపదార్థాల ధరలు, ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హెచ్‌ఎంఐఎల్‌ పేర్కొంది. కాగా ఏప్రిల్‌లో హెచ్‌ఎంఐఎల్‌ తన అన్ని వాహనాల ధరలను 1 శాతం మేర పెంచింది.

ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..

Updated Date - May 28 , 2026 | 02:37 AM