బ్లూజే ఏరో నుంచి రెండోతరం ఎయిర్‌క్రాఫ్ట్
ABN , Publish Date - May 27 , 2026 | 05:25 AM
హైదరాబాద్‌కు చెందిన డీప్ టెక్ స్టార్టప్ బ్లూజే ఏరోస్పేస్ మరో సరికొత్త విమానాన్ని ఆవిష్కరించింది. ‘జెన్ 2’ పేరుతో ఆవిష్కరించిన ఈ ప్రోటోటైప్ విమానాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు వస్తువుల రవాణా కోసం...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన డీప్ టెక్ స్టార్టప్ బ్లూజే ఏరోస్పేస్ మరో సరికొత్త విమానాన్ని ఆవిష్కరించింది. ‘జెన్ 2’ పేరుతో ఆవిష్కరించిన ఈ ప్రోటోటైప్ విమానాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు వస్తువుల రవాణా కోసం ఉపయో గించవచ్చని తెలిపింది. బ్యాటరీతో పని చేసే ఈ విమానం 200 కిలోల బరువైన వస్తువులతో నిలువునా టేకాఫ్ తీసుకుని, అదే విధంగా కిందికి దిగుతుందని పేర్కొంది. కంపెనీకి చెందిన వాంటిస్ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ ఇదని పేర్కొంది. నాలుగేళ్ల పాటు శ్రమించి ఈ విమానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. 2027 నాటికి వాణిజ్యపరంగా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. బ్లూజే ఏరో ఇప్పటికే 500 కేజీల సామర్థ్యంతో కూడిన ఈవోటల్ ఎయిర్‌క్రా్‌ఫ్టను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికే ఈ విమానాలను పైలెట్ ప్రాతిపదికన విజయవంతంగా ఉపయోగించినట్లు బ్లూజే ఏరో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..
నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..