Share News

హైదరాబాద్‌లో ఆఫీస్‌ లీజింగ్స్‌ అదుర్స్‌

ABN , Publish Date - May 20 , 2026 | 05:46 AM

హైదరాబాద్‌.. కార్యాలయ స్థలాల (ఆఫీసు స్పేస్‌) లీజుల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో...

హైదరాబాద్‌లో ఆఫీస్‌ లీజింగ్స్‌ అదుర్స్‌

  • జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయికి

  • కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌.. కార్యాలయ స్థలాల (ఆఫీసు స్పేస్‌) లీజుల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 31.5 లక్షల ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన 220 లక్షల ఎస్‌ఎ్‌ఫటీ ఆఫీస్‌ లీజు ఒప్పందాల్లో ఇది 14 శాతానికి సమానమని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదికలో తెలిపింది. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చినా హైదరాబాద్‌లో కార్యాలయ భవనాల లీజు విస్తీర్ణం 21.6ుపెరిగింది.

  • మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ లీజుల్లో ఐటీ-బీపీఎం కంపెనీల వాటా 36ు. ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేస్‌ కంపెనీల వాటా 30 శాతం

  • మొత్తం ఆఫీస్‌ స్పేస్‌లో 26ు వాటా జీసీసీలదే. 23 శాతం వాటాతో నాలుగో స్థానంలో బీఎ్‌ఫఎ్‌సఐ కంపెనీలు

  • గత ఏడాదితో పోలిస్తే 11.6 శాతం పెరిగిన రెంటల్స్‌.మొత్తం కార్యాలయ స్థలాల లీజుల్లో మాదాపూర్‌ ప్రాంతం వాటా 91 శాతం

  • ఎస్ఎప్టీ సగటు లీజు ధర రూ.92.2

ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 20 , 2026 | 05:46 AM