Share News

20న హైదరాబాద్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సదస్సు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:51 AM

ఔత్సాహిక పారిశామ్రికవేత్తల కోసం ఈ నెల 20న హైదరాబాద్‌ లో హైదరాబాద్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సదస్సు (హెచ్‌ఈఎస్‌)-2026 జరగనుంది

20న హైదరాబాద్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సదస్సు
epc

20న హైదరాబాద్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సదస్సు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఔత్సాహిక పారిశామ్రికవేత్తల కోసం ఈ నెల 20న హైదరాబాద్‌ లో హైదరాబాద్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ సదస్సు (హెచ్‌ఈఎస్‌)-2026 జరగనుంది. టై హైదరాబాద్‌ చాప్టర్‌, హైదరాబాద్‌ ఆంత్రప్రెన్యూరియల్‌ ఎకోసిస్టమ్‌ కలెక్టివ్‌ (హెచ్‌ఈఈసీటీ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. ఈ సదస్సులో తమ వినూత్న వ్యాపార ఉత్పత్తులు, సేవలను వెంచర్‌ క్యాపిటలిస్టులకు పరిచయం చేసేందుకు వెయ్యికిపైగా స్టార్టప్‌ కంపెనీల నుంచి దరఖాస్తులు అందినట్టు టై హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ కాకర్ల మురళి చెప్పారు. ఈ సదస్సు ద్వారా గత ఏడాదిలానే 50 వినూత్న స్టార్టప్‌ కంపెనీలను ఎంపిక చేసి, వాటి పేర్లతో ఒక పుస్తకం ప్రచురించబోతున్నట్టు తెలిపారు. వినూత్న వ్యాపార ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌ కంపెనీలకు హెచ్‌ఈఎస్‌-2026 చక్కటి వేదిక అని మురళి చెప్పారు. ఈ సదస్సులో హైదరాబాద్‌ ఏంజెల్స్‌తో పాటు 25 వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) ఫండ్స్‌ కూడా పాల్గొంటున్నాయి.

Updated Date - Nov 11 , 2026 | 06:26 AM