Share News

హెచ్‌ఆర్‌వీ ఫార్మా చేతికి జర్మనీ సంస్థ

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:16 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌వీ ఫార్మా.. జర్మనీకి చెందిన ఫాటెబో జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసింది.

హెచ్‌ఆర్‌వీ ఫార్మా చేతికి జర్మనీ సంస్థ
hrv

  • హెచ్‌ఆర్‌వీ ఫార్మా చేతికి జర్మనీ సంస్థ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న హెచ్‌ఆర్‌వీ ఫార్మా.. జర్మనీకి చెందిన ఫాటెబో జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసింది. జీరోస్టాక్‌ కార్ప్‌ నుంచి ఫాటెబోలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసినట్లు హెచ్‌ఆర్‌వీ ఫార్మా తెలిపింది. అయితే ఈ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించిదనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. 2025లో ఫాటెబో ఆదాయం రూ.350 కోట్లుగా ఉంది. హెచ్‌ఆర్‌వీ ఫార్మా ఇప్పటికే యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ)లో ఉండగా ఈ కొనుగోలుతో ఫినిష్డ్‌ ఫార్ములేషన్స్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.

ఈ డీల్‌తో ఫాటెబో.. హెచ్‌ఆర్‌వీ ఫార్మాకు పూర్తి అనుబంధ సంస్థగా మారినప్పటికీ జర్మనీలోని హిల్‌జిన్‌జెన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది. 2015లో ఏర్పాటైన ఫాటెబో.. క్లినికల్‌ ట్రయల్‌ సప్లయ్‌లో హోల్‌సేల్‌ ఆథరైజేషన్‌, స్పెషలైజేషన్‌ను కలిగి ఉంది.

Updated Date - Nov 04 , 2026 | 06:16 AM