రెండేళ్లలో రూ.950 కోట్ల పెట్టుబడి
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:35 AM
హెచ్‌ఎఫ్‌సీఎల్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. ఇందుకోసం వచ్చే రెండేళ్లలో రూ.950 కోట్లు ఖర్చు చేస్తామని కంపెనీ ఎండీ...
హెచ్‌ఎఫ్‌సీఎల్ ఎండీ మహేంద్ర నహతా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెచ్‌ఎఫ్‌సీఎల్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. ఇందుకోసం వచ్చే రెండేళ్లలో రూ.950 కోట్లు ఖర్చు చేస్తామని కంపెనీ ఎండీ మహేంద్ర నహతా వెల్లడించారు. కంపెనీ అభివృద్ధి చేసిన డేటా సెంటర్ సొల్యూషన్ ‘ఆప్టిక్యూ ఏఐ’ని విడుదల చేస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. డేటా సెంటర్ సెగ్మెంట్‌లో ముఖ్యంగా అమెరికాలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌కు భారీ డిమాండ్ ఉందన్నారు. ఇందులో రూ.580 కోట్లు ఆప్టికల్ ఫైబర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం వినియోగిస్తారు. ఈ విస్తరణ, బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌తో వార్షిక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుత 3.9 కోట్ల ఫైబర్ కిలోమీటర్ల నుంచి 4.5 కోట్ల కిలోమీటర్లకు, ఆప్టికల్ ఫైబర్ ఉత్పత్తి సామర్థ్యం 3 కోట్ల రూట్ కిలోమీటర్ల (ఆర్‌కేఎం) నుంచి 40 ఆర్‌కేఎంకు పెరుగుతుందని నహతా చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్..!