Share News

హెరిటేజ్‌ ఆదాయం రూ.1,127 కోట్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:15 AM

సెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఆదాయం రూ.1,126.9 కోట్లకు పెరిగింది.

హెరిటేజ్‌ ఆదాయం రూ.1,127 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఆదాయం రూ.1,126.9 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి నమోదైన రూ.1,042.26 కోట్ల రెవెన్యూతో పోలిస్తే 8.2 శాతం వృద్ధి నమోదైంది. కాగా, ఈ క్యూ3లో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.34.5 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో నమోదైన రూ.43 కోట్ల లాభంతో పోలిస్తే దాదాపు 20 శాతం తగ్గింది. వ్యాపార నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరగడంతో పాటు పాల సరఫరా తగ్గడం, పాల సేకరణ ఖర్చు పెరగడం ఇందుకు కారణమైందని కంపెనీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

నయీం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం..

Updated Date - Jan 29 , 2026 | 06:15 AM