Share News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై అధిక వడ్డీ చెల్లింపుల ఆరోపణలు..

ABN , Publish Date - May 28 , 2026 | 02:42 AM

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్థ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ మరోసారి చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై అధిక వడ్డీ చెల్లింపుల ఆరోపణలు..

3 శాతం నష్టపోయిన షేరు

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్థ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ మరోసారి చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఎ్‌సఆర్‌డీసీ) నుంచి డిపాజిట్లను ఆకర్షించేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిబంధనలను అతిక్రమించి బ్యాంక్‌ రూ.45 కోట్ల అధిక వడ్డీ చెల్లింపులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, బ్యాంక్‌ ఈ సొమ్మును నేరుగా ఎంఎ్‌సఆర్‌డీసీ ఖాతాకు బదిలీ చేయకుండా, తన మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఈ ప్రభుత్వ శాఖ నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమానికి స్పాన్సర్‌ చేసినట్లుగా చూపించిందని ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఇన్వెస్టిగేటివ్‌ కథనం పేర్కొంది. అంతేకాదు, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ శశిధర్‌ జగదీషన్‌కు ఆమోదంతోనే ఇది జరిగిందని రిపోర్టు ఆరోపించింది. పాలనా ప్రమాణాలు, నైతిక ఉల్లంఘనలకు సంబంధించిన ఈ ఆరోపణలను బ్యాంక్‌ తోసిపుచ్చింది. అయినప్పటికీ, బీఎ్‌సఈలో బ్యాంక్‌ షేరు ధర బుధవారం ఒక దశలో 2..87 శాతం పతనమైంది. చివరికి 2.63 శాతం నష్టంతో రూ.758.50 వద్దకు పడిపోయింది. దాంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.31,331 కోట్ల మేర తరిగిపోయి రూ.11.67 లక్షల కోట్లకు పరిమితమైంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పాలనా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవికి అతను చక్రవర్తి రాజీనామా చేసినప్పటి (మార్చి 18) నుంచి షేరు దాదాపు 10 శాతం క్షీణించింది.

ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి.

Updated Date - May 28 , 2026 | 02:42 AM