Share News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ఇద్దరు

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:04 AM

ప్రైవేట్‌ రంగంలోనిహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌   ఎండీ, సీఈఓ  రేసులో ఇద్దరు
hdfc

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌.. కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన వారసుడిగా నియమించేందుకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రాధాన్యత క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి సిఫారసు చేసింది. కాగా మూడేళ్ల కాలానికి ప్రతిపాదించిన ఈ నియామకం.. ఆర్‌బీఐ తుది ఆమోదానికి లోబడి ఉంటుందని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ తెలిపింది. అయితే ఆర్‌బీఐకి సిఫారసు చేసిన ఆ ఇద్దరి పేర్లను మాత్రం బ్యాంక్‌ వెల్లడించలేదు.

ఆర్‌బీఐకి పంపించిన పేర్లలో హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌ మాజీ డిప్యూటీ ఎండీ పరేశ్‌ సుతాంకర్‌, భారత్‌లో సిటీ చీఫ్‌ కంట్రీ ఆఫీసర్‌ కే బాలసబ్రమణియన్‌, ఆదిత్య బిర్లా సీఈఓ విశాఖ మూల్యే, హెచ్‌డీఎఫ్‌సీ ‌బ్యాంక్‌ చీఫ్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ జిమ్మీ టాటా, హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌ సీఈఓ, ఎండీ విభా పదాల్కర్‌ ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Sep 13 , 2026 | 01:04 AM