Share News

జీటీపీఎల్‌ హాత్‌వే చేతికి యాక్ట్‌ కేబుల్‌ టీవీ వ్యాపారం

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:12 AM

దక్షిణాదిలో తన కేబుల్‌ టీవీ కార్యకలాపాలను విస్తరించుకునే వ్యూహం లో భాగంగా యాక్ట్‌ గ్రూప్‌నకు చెందిన కేబుల్‌ టెలివిజన్‌ వ్యాపారాన్ని రూ.36.23 కోట్లకు కొనుగోలు...

జీటీపీఎల్‌ హాత్‌వే చేతికి  యాక్ట్‌ కేబుల్‌ టీవీ వ్యాపారం

న్యూఢిల్లీ: దక్షిణాదిలో తన కేబుల్‌ టీవీ కార్యకలాపాలను విస్తరించుకునే వ్యూహం లో భాగంగా యాక్ట్‌ గ్రూప్‌నకు చెందిన కేబుల్‌ టెలివిజన్‌ వ్యాపారాన్ని రూ.36.23 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు జీటీపీఎల్‌ హాత్‌వే ప్రకటించింది. ఈ మేరకు ఏడు యాక్ట్‌ గ్రూప్‌ కంపెనీలతో వ్యాపార బదిలీ ఒప్పందాన్ని (బీటీఏ) కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ కంపెనీల్లో ఏ.సీ.ఎన్‌ కేబుల్‌, యాక్ట్‌ డిజిటల్‌ హోం ఎంటర్‌టైన్‌మెంట్‌, అట్రియా బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసెస్‌, కేబుల్‌ ఫస్ట్‌ ఇండియా, శ్రీ వెంకటేశ్వర డిజిటల్‌ హోం ఎంటర్‌టైన్‌మెంట్‌, మండపేట డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐబీ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఉన్నాయి. ఈ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలోని పలు నగరాల్లో కేబుల్‌ టెలివిజన్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 04:12 AM