జిఎస్‌కే నుంచి రక్త క్యాన్సర్ ఔషధం
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:07 AM
మల్టిపుల్ మైలోమా అనే రక్త క్యాన్సర్ చికిత్సకు సంబంధించి కాంబినేషన్ థెరపీ ఔషధం ‘బ్లెన్‌రెప్’ను (బెలాంటమాబ్ మఫోడోటిన్) గ్లాక్సో...
న్యూఢిల్లీ: మల్టిపుల్ మైలోమా అనే రక్త క్యాన్సర్ చికిత్సకు సంబంధించి కాంబినేషన్ థెరపీ ఔషధం ‘బ్లెన్‌రెప్’ను (బెలాంటమాబ్ మఫోడోటిన్) గ్లాక్సో స్మిత్‌క్లెయిన్ ఫార్మాస్యూటికల్స్ (జిఎస్‌కే ఇండియా).. భారత మార్కెట్లోకి విడుదల చేసింది. చికిత్స తర్వాత తిరగబెట్టిన మల్టిపుల్ మైలోమా లేదా చికిత్సకు లొంగని కేసుల్లో దీన్ని వినియోగిస్తారు. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి (సీడీజిఎస్‌సీవో) ఈ ఔషధానికి అనుమతి మంజూరు చేసింది. కంపెనీ దీని ఽధరను అధికారికంగా ప్రకటించలేదు. కానీ రూ.2 లక్షలకు పైన ఉండొచ్చని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!