ప్రభుత్వ సెక్యూరిటీలకు తగ్గిన ఆదరణ
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:01 AM
పింఛను, బీమా రంగ సంస్థలు ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచుకుంటుండడంతో ప్రభుత్వ సెక్యూరిటీలకు...
ముంబై: పింఛను, బీమా రంగ సంస్థలు ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచుకుంటుండడంతో ప్రభుత్వ సెక్యూరిటీలకు (జీ-సెక్‌లు) డిమాండ్ తగ్గినట్టు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ రోహిత్ జైన్ తెలిపారు. చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలిక జీ-సెక్‌లకు బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ నుంచి స్థిరమైన డిమాండ్ ఉండేదన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారని.. ఈ తరుణంలో ఆకర్షణీయమైన రేట్లపై దీర్ఘకాలిక పేపర్లను జారీ చేయడం సవాలుతో కూడుకున్నదిగా జైన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ బర్త్‌డే విషెస్..
వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!