పెట్రోల్, డీజిల్ నష్టాలను ప్రభుత్వం భరించదు..
ABN , Publish Date - May 05 , 2026 | 05:49 AM
పశ్చిమాసియా యుద్ధంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ).. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన (ఏటీఎ్‌ఫ) అమ్మకాలపై ఎదుర్కొంటున్న నష్టాలను...
ఆ భారమంతా కంపెనీలదే..
కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాత శర్మ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ).. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన (ఏటీఎ్‌ఫ) అమ్మకాలపై ఎదుర్కొంటున్న నష్టాలను భరించడం తమ వల్ల కాదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ నష్టాలు భరించే ఆలోచన కూడా లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ఓఎంసీలు వీటి ధరలు పెంచలేదు. ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవడంతో ఈ నష్టాల్ని కొంతైనా భర్తీ చేసుకునేందుకు ఓఎంసీలు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఓఎంసీలు గత నెల దేశీయ విమానయాన సంస్థలకు సరఫరా చేసే ఏటీఎఫ్ ధరను 25 శాతం, విదేశీ విమానయాన సంస్థలకు సరఫరా చేసే ఏటీఎఫ్ ధరను 5 శాతం పెంచాయి. లీటరుకు రూ.25 నుంచి రూ.28 వరకు నష్టం వస్తున్నా ప్రభుత్వ ఒత్తిడితో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, గత రెండు నెలలుగా ఓఎంసీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా సంయమనం పాటించాయి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం ఇక వడ్డింపే తరువాయి అని భావిస్తున్నారు. అయితే ఈ వడ్డింపు ఒకేసారి ఉంటుందా? లేక దశల వారీగా ఉంటుందనేది తేలాల్సి ఉంది.
ఈ వార్తలూ చదవండి:
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..