ఎగుమతిదారులకు ఊరట
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:44 AM
పశ్చిమాసియా సంక్షోభంతో ఇక్కట్లలో పడిన ఎగుమతిదారుల రక్షణ కోసం ప్రభుత్వం ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు (రోడ్‌టెప్) పథకం కింద...
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో ఇక్కట్లలో పడిన ఎగుమతిదారుల రక్షణ కోసం ప్రభుత్వం ఎగుమతి ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల మినహాయింపు (రోడ్‌టెప్) పథకం కింద ప్రయోజనాలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే ఈ పథకం కింద అందిస్తున్న ప్రయోజనాలను ప్రభుత్వం సగానికి తగ్గించింది. ప్రస్తుత సంక్షుభిత సమయంలో ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణం అంటే ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు అమలులో ఉండేలా అర్హులైన ఎగుమతిదారులందరికీ ఆ పథకం కింద అన్ని ప్రయోజనాలనూ పునరుద్ధరిస్తున్నట్టు విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీఎఫ్‌టీ) కార్యాలయం తెలిపింది.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం