Vodafone Idea: వొడాఫోన్‌కు భారీ ఊరట
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:30 AM
రుణాల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఆ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ...
బకాయిల చెల్లింపుపై
5 సంవత్సరాల మారటోరియం
న్యూఢిల్లీ: రుణాల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఆ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ స్తంభింపచేయడంతో పాటు చెల్లింపులన్నింటిపై ఐదు సంవత్సరాల మారటోరియంను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ భారీ ప్యాకేజికి ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం కింద ప్రభుత్వానికి వీఐఎల్ చెల్లించాల్సిన రూ.87,695 కోట్ల బకాయిల చెల్లింపు 2031-32 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించి 2040-41 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీఐఎల్‌లో ప్రభుత్వానికి 48.9ు వాటాలున్నాయి. తన ప్రయోజనాలు పరిరక్షించుకోవడంతో పాటు స్పెక్ట్రమ్ చార్జీలు, ఏజీఆర్ బకాయిలు సక్రమంగా ప్రభుత్వానికి చెల్లించేందుకు సహాయపడడం, టెలికాం రంగంలో ఆరోగ్యవంతమైన పోటీని ప్రోత్సహించడం, 20 కోట్ల మంది కస్టమర్ల ప్రయోజనాలు పరిరక్షించడం ఈ ప్యాకేజి లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి