షాకిచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధరలు
ABN , Publish Date - Mar 17 , 2026 | 10:27 AM
దేశంలో నేడు పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మరి హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మంగళవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దేశంలో మేలిమి బంగారం ధర సగటున రూ.1200ల మేర పెరిగింది. వెండి ధర కూడా సగటున రూ.5 వేల మేర ఎగబాకింది (Gold, Silver Rates March 17).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,620లకు ఎగబాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.1200ల మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.1100ల మేర పెరిగి రూ.1,45,400కు చేరుకుంది. నగరంలో వెండి ధర రూ.4 వేల మేర పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.8 లక్షలు పలుకుతోంది.
ఇక చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,820గా ఉంది. ఢిల్లీలో రూ.1,58,770 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,58,620గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,46,500గా, ఢిల్లీలో రూ.1,45,550గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.1,45,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.2.8 లక్షలకు చేరుకోగా ఇతర ప్రధాన నగరాల్లో రూ.2.75 లక్షల వద్ద కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
గీత దాటితే పెనాల్టీ.. సెబీ ఛైర్మన్ హెచ్చరిక