Share News

పసిడి ధరల్లో భారీ కోత.. ప్రస్తుతం రేట్స్ ఇవీ!

ABN , Publish Date - Mar 17 , 2026 | 06:43 AM

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం

పసిడి ధరల్లో భారీ కోత.. ప్రస్తుతం రేట్స్ ఇవీ!
Gold, Silver Rates on March 17

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేటులో కోత ఉండదన్న అంచనాలు లోహాలకు డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మంగళవారం) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,410గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,44,290కు దిగొచ్చింది. వెండి ధర కూడా ఇదే బాటలో కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,76,000ల వద్ద తచ్చాడుతోంది. విజయవాడలో కూడా పసిడి, వెండి ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి (Gold, Silver Rates on March 17).

ఇక నిన్న (సోమవారం) దేశంలో సగటున పసిడి ధర రూ.2,240 మేర పడిపోగా వెండి ధరలో రూ.5 వేల మేర కోత పడింది. ముడి చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటులో కోత మరింత ఆలస్యం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయన్న భావన కూడా ప్రామాణిక వడ్డీ రేటు కోతపై ఆశలు తగ్గేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా డాలర్ బలపడి, బంగారం, వెండికి డిమాండ్‌ తాత్కాలికంగా తగ్గిందని చెబుతున్నారు.


ప్రధాన నగరాల్లో పసిడి (24కే, 22కే) ధరలు

  • చెన్నై: ₹1,60,470; ₹1,47,090;

  • ముంబై: ₹1,57,410; ₹1,44,290;

  • ఢిల్లీ: ₹1,57,560; ₹1,44,440;

  • కోల్‌కతా: ₹1,57,410; ₹1,44,290;

  • బెంగళూరు: ₹1,57,410; ₹1,44,290;

  • హైదరాబాద్: ₹1,57,410; ₹1,44,290;

  • విజయవాడ: ₹1,57,410; ₹1,44,290;

  • కేరళ: ₹1,57,410; ₹1,44,290;

  • పుణె: ₹1,57,410; ₹1,44,290;

  • వడోదరా: ₹1,57,460; ₹1,44,340;

  • అహ్మదాబాద్: ₹1,57,460; ₹1,44,340;

వెండి (కిలో) ధరలు ఇలా

  • చెన్నై: ₹2,75,900;

  • ముంబై: ₹2,69,900;

  • ఢిల్లీ: ₹2,69,900;

  • కోల్‌కతా: ₹2,69,900;

  • బెంగళూరు: ₹2,69,900;

  • హైదరాబాద్: ₹2,75,900;

  • విజయవాడ: ₹2,75,900;

  • కేరళ: ₹2,75,900;

  • పుణె: ₹2,69,900;

  • వడోదరా: ₹2,69,900;

  • అహ్మదాబాద్: ₹2,69,900;


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఇవీ చదవండి:

గీత దాటితే పెనాల్టీ.. సెబీ ఛైర్మన్ హెచ్చరిక

తగ్గిన వాణిజ్య లోటు

Updated Date - Mar 17 , 2026 | 07:07 AM