Share News

పది గ్రాములకు రూ. 2,290కి పైగా తగ్గిన బంగారం ధర

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:26 AM

బుధవారం ఉవ్వెత్తున పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. యూరోపియన్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులతో నిన్న ధరలు నింగిని తాకాయి. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఇవాళ పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి.

పది గ్రాములకు రూ. 2,290కి పైగా తగ్గిన బంగారం ధర
Gold Price Today In India

ఆంధ్రజ్యోతి, జనవరి 22: నిన్న(బుధవారం) ఉవ్వెత్తున పెరిగిన బంగారం ధరలు ఇవాళ(జనవరి 22, 2026) తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజే 100 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.50 వేలకు పైగా పెరిగింది. యూరోపియన్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులతో నిన్న ధరలు నింగిని తాకాయి. అయితే.. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఇవాళ పసిడి ధరలు నేలచూపులు చూస్తున్నాయి.

ఇక.. గురువారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారట్ల గ్రాము బంగారం ధరపై రూ.229 తగ్గి రూ.15,431 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారంపై రూ.210 తగ్గి రూ.14,145 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము పసిడి రూ.172 తగ్గి రూ.11,573 వద్ద ట్రేడ్ అవుతోంది.

100 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధరపై రూ.22,900 తగ్గి రూ.15,43,100 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 21,000 తగ్గి రూ. 14,14,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు ధర రూ.17,200 తగ్గి రూ.11,57,300 వద్ద ట్రేడ్ అవుతోంది.


ఇవాళ హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు వంటి చాలా నగరాల్లో బంగారం ధరలు సమానంగా ఉన్నాయి.

హైదరాబాద్:

10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310 దగ్గర ట్రేడ్ అవుతోంది.

10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,100 తగ్గి రూ.1,41,450 పలుకుతోంది

10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,720 తగ్గి రూ.1,15,730 గా నమోదైంది.

చెన్నై:

10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,910

10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,000

10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,18,500

ఢిల్లీ:

10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,460

10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,600

10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,15,880

విశాఖపట్నం:

10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310

10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,100 తగ్గి రూ.1,41,450

10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,720 తగ్గి రూ.1,15,730

బెంగళూరు:

10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310

10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.2,100 తగ్గి రూ.1,41,450

10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,720 తగ్గి రూ.1,15,730

గమనిక: ఈ కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి.

Updated Date - Jan 22 , 2026 | 12:08 PM