పసిడి రుణాల జోరుకు బ్రేక్!
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:51 AM
బంగారంపై రుణాలను ఇస్తున్న కంపెనీలకు పెద్ద సమస్య వచ్చి పడింది. పసిడి ధర రోజురోజుకీ తగ్గడం ఈ కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అసలు, వడ్డీల వసూళ్లు సమస్యగా మారి హామీగా...
గోల్డ్ లోన్ కంపెనీలకు వసూళ్ల సమస్య.. పెరగనున్న ఆభరణాల వేలం
న్యూఢిల్లీ: బంగారంపై రుణాలను ఇస్తున్న కంపెనీలకు పెద్ద సమస్య వచ్చి పడింది. పసిడి ధర రోజురోజుకీ తగ్గడం ఈ కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అసలు, వడ్డీల వసూళ్లు సమస్యగా మారి హామీగా పెట్టుకున్న బంగారం, ఆభరణాలను ఎక్కడ వేలం వేయాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నాయి. పండగల ఖర్చులు, తగ్గుతున్న పసిడి ధర, ఇతర సీజనల్ ఖర్చులతో పసిడి రుణాల వసూలు కష్టమవుతుందని భావిస్తున్నాయి. దీంతో 2026 డిసెంబరుతో ముగిసే మూడో త్రైమాసికం (క్యూ3)లో పసిడి రుణాల జోరు, గతంలో ఉన్నంత స్థాయిలో ఉండక పోవచ్చని ఐఐఎ్‌ఫఎల్ పైనాన్స్ ప్రెసిడెంట్ మయాంక్ శర్మ చెప్పారు. ధరల ప్రస్తుత పతనానికి చెక్ పడి, స్థిరపడిన తర్వాత హామీగా పెట్టుకున్న ఆభరణాల వేలం గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలలో పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం పసిడి రుణాలు తీసుకున్న వారి నుంచి అసలు, వడ్డీ వసూలు చేసుకోవడమే పెద్ద సమస్యగా మారిందన్నారు.
తాజా రుణాల డిమాండ్ ఓకే: రుణ వసూళ్ల సమస్య ఉన్నా కొత్తగా తీసుకునే పసిడి రుణాలకు పెద్దగా ఢోకా ఉండకపోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇది గతంలో ఉన్నంత భారీగా మాత్రం ఉండదని త్వరలో గోల్డ్ లోన్ కంపెనీల సమాఖ్య (ఎఫ్‌జీఎల్‌ఓసీ) సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న పినాకినాథ్ బెనర్జీ చెప్పారు. గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీల టియర్-1 మూలధన కనీస పరిమితిని ప్రస్తుత 12 శాతం నుంచి 10 శాతానికి కుదించాలని కూడా ఆయన సూచించారు. దీంతో పాటు ఈ రంగంలో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా తిరిగి గుర్తించడం, స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేయనున్నట్టు చెప్పారు. బ్యాంకులు.. గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా గుర్తిస్తే పసిడి రుణాలపై ప్రస్తుతం ఉన్న 18-20 శాతం వడ్డీ రేటు 5 నుంచి 6 శాతం తగ్గుతుందని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రెసిడెంట్ మయాంక్ శర్మ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..