ధనత్రయోదశి నాడు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి
ABN , Publish Date - Nov 06 , 2026 | 02:52 PM
ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూన్. పసిడి, వెండి ధరలు నేడు మరింతగా తగ్గాయి.
ఇంటర్నెట్ డెస్క్: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూన్. పసిడి, వెండి ధరలు నేడు మరింతగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ (10 గ్రాముల) ధర రూ.2,451 మేర తగ్గి రూ.1,41,644 వద్ద ట్రేడవుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ (1 కిలో) ధర కూడా రూ.3,782 మేర తగ్గి రూ.1,83,358 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1.70 శాతం తగ్గగా, వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర 2.02 శాతం తగ్గింది. పారిశ్రామిక డిమాండ్‌లో మార్పులతో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ కనిపించింది.
వివిధ నగరాల్లో బంగారం స్పాట్ ధరలు (10 గ్రాములు) ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | |
ఢిల్లీ | ₹1,40,930 | ₹1,29,090 |
ముంబై | ₹1,40,930 | ₹1,29,090 |
చెన్నై | ₹1,41,250 | ₹1,29,390 |
హైదరాబాద్ | ₹1,40,910 | ₹1,29,070 |
బెంగళూరు | ₹1,40,930 | ₹1,29,090 |
జైపూర్ | ₹1,40,930 | ₹1,29,090 |
కోల్‌కతా | ₹1,40,930 | ₹1,29,090 |
పుణె | ₹1,40,930 | ₹1,29,090 |
వివిధ నగరాల్లో వెండి ధరలు ఇలా
నగరం | కిలో వెండి ధర |
ఢిల్లీ | ₹1.82 లక్షలు |
ముంబై | ₹1.81 లక్షలు |
చెన్నై | ₹1.82 లక్షలు |
హైదరాబాద్ | ₹1.82 లక్షలు |
బెంగళూరు | ₹1.81 లక్షలు |
జైపూర్ | ₹1.82 లక్షలు |
కోల్‌కతా | ₹1.82 లక్షలు |
పుణె | ₹1.81 లక్షలు |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
కొనసాగుతున్న లాభాలు.. 1,200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..
ఎస్‌ఈటీఎల్ లాభంలో 38 శాతం వృద్ధి