బంగారం, వెండి.. భారీగా తగ్గాయ్
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:57 AM
విలువైన లోహాలు కొండ దిగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9ు స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.9,050 తగ్గి రూ.1,43,600కు జారుకుంది. కిలో వెండి...
విలువైన లోహాలు కొండ దిగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9ు స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.9,050 తగ్గి రూ.1,43,600కు జారుకుంది. కిలో వెండి రూ.10,500 తగ్గుదలతో రూ.2.30 లక్షలకు దిగివచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు (ఏప్రిల్‌లో డెలివరీ) రేటు ఏకంగా రూ.14,897 (10.3ు) పతనమై రూ.1,29,595 వద్దకు పడిపోయింది. ఈ జనవరి 29న నమోదైన ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయి రూ.1,93,096తో పోలిస్తే, ఇప్పటివరకు బంగారం ధర రూ.63,501 (దాదాపు 33ు) తగ్గింది. అంతర్జాతీయ విపణిలో వీటి ధరలు భారీగా తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒకదశలో 474.9 డాలర్లు (10.4ు) క్షీణించి 4,100 డాలర్లకు జారుకుంది. వెండి 61.21 డాలర్లకు పడిపోయింది. గతవారంలోనూ పసిడి 10 శాతానికి పైగా పతనమైంది. బులియన్‌కు గడిచిన 4 దశాబ్దాల్లోకెల్లా ఇది అత్యంత గడ్డువారమని అంటున్నారు
.
కారణాలేంటి..?
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు భగ్గుమంటోంది. దాంతో మార్కెట్లో వస్తు, సేవలు మరింత ప్రియమవుతున్నాయి.. ధరాఘాతాన్ని తగ్గించేందుకు అమెరికన్ ఫెడ్ రిజర్వ్ సహా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను మళ్లీ పెంచవచ్చన్న అంచనాలతో బంగారం, వెండిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారు. ఫెడ్ రేట్లు, విలువైన లోహాలది విలోమ సంబంధం కావడమే ఇందుకు కారణం. సాధారణంగా ఫెడ్ రేట్లు తగ్గుతున్నప్పుడు బంగారం ధర పెరుగుతూ వస్తుంది. గడిచిన రెండేళ్లలో అదే జరిగింది. ఫెడ్ రేట్లు పెరిగితే.. బంగారం తగ్గుముఖం పడుతుంది.
డాలర్ బలహీనంగా ఉన్న గడిచిన రెండేళ్లలో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు తమ విదేశీ మారకం నిల్వల్లో అమెరికన్ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా భారీగా బంగారం కొనుగోలు చేస్తూ వచ్చాయి. ఈ ఏడాదిలో సెంట్రల్ బ్యాంక్‌లు బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా తగ్గించాయి. దాంతో డిమాండ్ కూడా తగ్గింది.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం