కల్తీ బంగారంపై జర జాగ్రత్త జీజేసీ
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:38 AM
పసిడి ధర తగ్గుతున్న నేపథ్యంలో బంగారంలో రెనియం, ఇరీడియం ఆధారిత మిశ్రమ లోహాలు కల్తీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై..
పసిడి ధర తగ్గుతున్న నేపథ్యంలో బంగారంలో రెనియం, ఇరీడియం ఆధారిత మిశ్రమ లోహాలు కల్తీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై భారతీయ ప్రామాణికాల సంస్థ బీఐఎస్‌ను అప్రమత్తం చేసినట్టు ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమిస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) తెలిపింది. కొనుగోలుదారులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ కల్తీతో పసిడి స్వచ్ఛతలో ఎలాంటి తేడా లేకపోయినా, బరువులో మాత్రం తేడా ఉంటుందని తెలిపింది. అయితే ఈ విషయంలో కొనుగోలుదారులు పెద్దగా గాభరా పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. బంగారం, నగలు కొనేటప్పుడే హాల్‌మార్క్ చెక్ చేసుకోవడంతో పాటు అవసరమైన అన్ని బిల్లులు తీసుకోవాలని కోరింది. తక్కువ మేకింగ్ చార్జీల ఆఫర్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని జీజేసీ కోరింది. ఏ మాత్రం అనుమానం వచ్చినా తమకు, బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..